Imprisonment Without Mask in Tamilnadu: మాస్క్ లేకపోతె జైలుకే.. నీలగిరి కలెక్టర్ ఇన్ఫోసిస్ దివ్య

Imprisonment Without Mask in Tamilnadu: మాస్క్ లేకపోతె జైలుకే.. నీలగిరి కలెక్టర్ ఇన్ఫోసిస్ దివ్య
x
Impresionment with out mask
Highlights

Impresionment Without Mask: ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.

Imprisonment Without Mask in Tamilnadu: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అనేక రాష్ట్రాల లో రొజూ అత్యిదిక కేసులు నమోదవుతన్నాయి. ఈ తరుణంలో తమిళనాడులోని నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్ఫోసిస్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పై జిల్లలో ఎవరైనా మాస్క్ లేకుండా భయటకు వచినా, మాస్క్ లేకుండా తిరిగినా, ఫైన్లు కాకుండా ఆరు నెలలు పాటు జైలు శిక్ష విదించనున్నారు. అలాగే, జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలుపై ఆంక్షలు విదిస్తూ వాటిని మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జరీ చేసారు. అయితే, గత 4రోజులుగా జిల్లలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావటం.. కరోనా కట్టడి కోసం జిల్లలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అధికారులకు కలెక్టర్ దివ్య ఆదేశాలు జరీ చేసారు. అంతే కాదు దెస వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది అని తెలిపారు. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తమ శక్తీ మేరకు ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజలు కూడా స్వచందంగా తమ వంతు ప్రయత్నంగా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రతలు తెసుకోవాలని కోరారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,148 కేసులు నమోదు కాగా, 587 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 11,55,191 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,02,529 ఉండగా, 7,24,577 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,084 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,33,395 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,43,81,303 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories