ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

*దావూద్ ఇబ్రహీం అనుచరులపై దాడులు

Rama Rao
Updated on: 9 May 2022 11:32 AM IST
NIA Raids Locations Linked to Dawood Ibrahim in Mumbai
X

ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA Raids: ముంబైలోని పలు ప్రాంతాల్లో NIA భారీ దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటూ హవాలా ఆపరేటర్లపై దాడులు కొనసాగుతున్నాయి. ముంబైకి చేరుకున్న NIA టీం 20 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్‌గా 20 చోట్లకు పైగా దాడులు జరుగుతున్నాయి.

దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్ గా 20 చోట్లకు పైగా ఈ దాడులు జరుగుతున్నాయి. నాగ్ పగడా, పరేల్, బోరివలి, శాంతాక్రజ్, ముంద్రా, భెండీ బజార్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తున్నారు అధికారులు. ఫిబ్రవరిలో ఎన్ఐఏ దీనిపై కేసులు నమోదుచేసింది. UAPA కేసుకి సంబంధించి దావూద్ అసోసియేట్స్ పై ఆరోపణలున్నాయి. దీనిపై ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డ్రగ్ సప్లయ్ దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టింది.

ఆయా సంస్థల కార్యకలాపాలను ఎన్ఐఏ నిశితంగా పరిశీలిస్తోంది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై ప్రధానంగా దాడులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలో అలజడి కలిగించేందుకు దావూద్ అనుచరులు స్కెచ్ వేశారనే సమాచారంతో దాడులు జరుగుతున్నాయి. విదేశాల్లో వుంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించేవారిపై నిఘా కొనసాగుతోంది. దాడుల్లో లభించే సమాచారం బట్టి తదుపరి చర్యలు వుంటాయని తెలుస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story