NIA Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు

NIA Raids: సయ్యద్ అబ్దుల్ జబ్బర్, నూరుల్లా హుస్సేన్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Shekhar G
Updated on: 16 Sept 2023 4:30 PM IST
NIA Raids In 31 Places In Tamil Nadu And Telangana States
X

NIA Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు

NIA Raids: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో NIA సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, కోయంబత్తూరుతో పాటు హైదరాబాద్ నగరంలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ అధికారుల సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ISIS సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు NIA గుర్తించింది. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. మదర్సాల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు NIA అధికారులు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాలు పాల్పడుతున్న అజర్ సిద్దిఖీ, సయ్యద్ జాహెద్, ఖాజా తమీజుద్దీన్, సయ్యద్ అబ్దుల్ జబ్బర్, నూరుల్లా హుస్సేన్‌ను NIA అధికారులు అరెస్ట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story