జమ్ముకశ్మీర్‌లోని 16 ప్రాంతాలంలో ఎన్ఐఏ దాడులు

*ఎన్ఐఏ అదుపులో 70మంది శ్రీనగర్‌ యువకులు *కశ్మీర్ వ్యాప్తంగా 570మందిని నిర్భందించిన ఎన్ఐఏ

Shilpa
Updated on: 10 Oct 2021 10:00 PM IST
NIA Raids in 16 Areas of Jammu and Kashmir
X

జమ్ముకశ్మీర్‌లోని 16ప్రాంతాలంలో ఎన్ఐఏ దాడులు(ఫైల్ ఫోటో)

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 16చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. వాయిస్ ఆఫ్ హింద్ ప్రింటింగ్ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐఈడీల రికవరీకి సంబంధించి ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్, కుల్గామ్, బారాముల్లాలోని 9 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది.

హసన్ రోడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్ అయిన నయీమ్ అహ్మద్ భట్, నంద్ సింగ్ చత్తబాల్‌లోని మస్తాక్ అహ్మద్ దార్ ఇంటిపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్క శ్రీనగర్‌లోనే 70 మంది యువకులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనుమానితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకుని, అనుమానితులను విచారిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story