NIA: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అతడి ఆచూకీ చెబితే ₹10లక్షల రివార్డు

NIA: ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్న NIA

Shekhar G
Published on: 6 March 2024 6:01 PM IST
NIA Announces Cash Reward Of 10 Lakh Rupees For Information On Bomber
X

NIA: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అతడి ఆచూకీ చెబితే ₹10లక్షల రివార్డు

NIA: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరమైంది. బాంబు పేలుడుకు పాల్పడిన వ్యక్తి గురించి సమాచారం ఇస్తే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇన్‌ఫార్మర్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ నెల 2న జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు కస్టమర్లతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. పేలుడు ఘటన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ముమ్మర గాలింపు చేస్తున్నారు. పేలుడు వెనుక ఒక వ్యక్తి ముసుగు, క్యాప్ ధరించి బస్సులో వచ్చినట్టు గుర్తించారు.

Shekhar G

Shekhar G

Next Story