అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టిస్తే భారీ నజరానా

Dawood Ibrahim: భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ చెప్పినవారికి NIA భారీ నజరానా ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 1 Sept 2022 8:00 PM IST
NIA Announces ₹25 Lakh Reward on Dawood Ibrahim
X

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టిస్తే భారీ నజరానా

Dawood Ibrahim: భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ చెప్పినవారికి NIA భారీ నజరానా ప్రకటించింది. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడు. ఈ నేపథ్యంలో దావూద్ దేశం విడిచి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెప్పిన వారికి 25 లక్షలు, చోటా షకీల్ ఆచూకీ చెబితే 20 లక్షలు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇదే కేసులో నిందితులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాక్, టైగర్ మెమన్‌ల వివరాలు చెప్పినవారికి ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున రివార్డు ఇస్తామని NIA వెల్లడించింది.

దావూద్ ఇబ్రహీం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా D-కంపెనీపై ఈ ఏడాది ఫిబ్రవరిలో NIA కేసు నమోదు చేసింది. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2018లో దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అతను ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story