
ఫాస్టాగ్ తీసుకోని వాహనదారులకు ఎన్‌హెచ్‌ఎఏ నిబంధనలు మరింత కఠినం చేసింది. ఫాస్టాగ్ వైపు వాహన దారులు దృష్టి సారించింకపోవడంతో కొత్త ఆంక్షలు తెరపెకి...
ఫాస్టాగ్ తీసుకోని వాహనదారులకు ఎన్‌హెచ్‌ఎఏ నిబంధనలు మరింత కఠినం చేసింది. ఫాస్టాగ్ వైపు వాహన దారులు దృష్టి సారించింకపోవడంతో కొత్త ఆంక్షలు తెరపెకి తెచ్చింది. దీంతో వాహనదారులు ఒత్తిడి తెచ్చి స్టాగ్స్ కొనిపించాలని నిర్ణయింతీసుకుంది. ఈ సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది.
టోల్‌ప్లాజాల చాలాకాలంగా ఉన్న రాయితీని ఫాస్టాగ్ వాహనాలకే కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ లేని వాహనాలకు రాయితీ వర్తింపచేయకుడదని నిర్ణయం తీసుకుంది. వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయాణం అయితే టోల్‌ప్లాజాల వద్ద రాయితీ ఉంటుంది. ఒకే రోజులో రిటర్న్ టోల్‌ఫీజులో సగం రాయితీ వాహనాలకు ఉంటుంది. నగదు రూపంలో వాహనాలకు టోల్ చెల్లించే వారు 24 గంటల్లో తిరుగు ప్రయాణంలో వచ్చిన మొత్తం ఫీజు చెల్లించాలి.
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల ఉన్న అన్ని లైన్లు జనవరి 15 నుంచి ఫాస్టాగ్ వాహనాలకు పూర్తిగా కేటాయించారు. అయితే ఒక్కో వైపు ఒక్కో లేన్ మాత్రమే ఫాస్టాగ్ లేని వాళ్లుకు నగదు చెల్లింపు కేటాయించారు. 17 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల్లో 15 చోట్ల ఫాస్ట్ టాగ్ విధానం అమలులోకి వచ్చింది. విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా తోపాటు రాయికల్ టోల్‌ప్లాజాలను మినహాయించారు. రహదారులపై నిత్యం తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్‌లు జారీ విధానం అమల్లోకి వచ్చింది. పాస్ ఉంటే టోల్ మినహాయింపు ఉంటుంది. టోల్ మినహాయింపు ఫాస్టాగ్‌తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్ ఫాస్టాగ్‌తో చెల్లింపు విధానంలోనే వాహనాలకు రాయితీ వర్తిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




