Weather Report: ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Weather Report: తెలంగాణ, ఏపీలో మూడురోజుల పాటు భారీ వర్షాలు

Jyothi
Published on: 3 May 2023 10:43 AM IST
Next 3 Days Heavy Rains In AP And Telangana
X

Weather Report: ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Weather Report: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అటు ఏపీలోనూ రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడుతున్న ప్రజలకు మరో షాకిచ్చింది భారత వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story