Newly elected Rajya Sabha members to take an oath : నేడు నూతన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

Arun Chilukuri
Published on: 22 July 2020 9:57 AM IST
Newly elected Rajya Sabha members to take an oath : నేడు నూతన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
X

దేశవ్యాప్తంగా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నూతన సభ్యులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రాజ్యసభ లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేయనున్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది సభ్యులు. నూతనంగా ఎన్నికైన మెజారిటీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్న రాజ్యసభ టి.వి ఛానల్ . కరోనా కారణంగా రాజ్యసభ లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నందున భౌతిక దూరం పాటించడం కోసం రాజ్యసభ లోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలోనే నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం ఆనవాయుతీ. కానీ కరోనా కారణంగా, మారిన పరిస్థితులలో పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నందున రాజ్యసభలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story