Karnataka: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: మంత్రి కన్నీళ్లు

Arun Chilukuri
Published on: 9 March 2021 9:10 PM IST
Karnataka: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: మంత్రి కన్నీళ్లు
X

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: మంత్రి కన్నీళ్లు

Karnataka: ఆ శృంగార వీడియోలో ఉన్నది తాను కాదని.. రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్రతోనే ఇది తయారు చేశారని కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చెప్పారు. మంగళవారం ఉదయం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో, సీడీ రెండూ పచ్చి అబద్ధమని తాను అమాయకుడినని రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలా చేశారని రమేష్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. అది తానే అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని దీనిపై పార్టీ హైకమాండ్‌కు సమాచారం అందించినట్లు వివరించారు కర్నాటక మాజీ మంత్రి రమేష్‌. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర పన్నారని ఆయన చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story