ఢిల్లీ కారు ప్రమాద ఘటనలో కొత్త అనుమానాలు

New Suspicions In Delhi Car Accident Incident
x

ఢిల్లీ కారు ప్రమాద ఘటనలో కొత్త అనుమానాలు

Highlights

* రోడ్డు ప్రమాదం కాదంటున్న మృతురాలి బంధువులు

Hit and Run Case: ఢిల్లీ శివారు ప్రాంతంలో జరిగిన మహిళ హిట్ ఆండ్ రన్ కేసులో రోజురోజుకు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రోడ్డు ప్రమాదానికి ముందు సదరు మహిళ మరో మహిళతో కలిసి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత స్కూటీపై ఉన్న మరో మహిళ ఏమైందని అనే చర్చ తెరపైకి వచ్చింది. ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్లగా ఒకర్ని కారు ఎలా ఢీకొట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కోణంలోనూ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైన ప్రత్యక్ష సాక్షిని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంజలి అనే మహిళ తన స్నేహితురాలితో కలిసి ఉండగా ఆమె స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత స్నేహితురాలు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు CCTV ఫుటేజీలో అంజలి తన స్నేహితురాలు నిధి స్కూటీని నడుపుతోంది. అంజలి స్కూటీ వెనుక సీటులో కూర్చున్నట్లు సీసీటీవీ దృశ్యాలు చూపిస్తున్నాయి.

ముర్తల్‌లో న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తుండగా సుల్తాన్‌పురి ప్రాంతంలో మహిళ స్కూటీని కారు ఢీకొట్టింది. మహిళ మృతదేహం కారు చక్రాలకు చిక్కుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లిందని పోలీసుల నివేదికలో వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత మహిళను గుర్తించకుండా ఐదుగురు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు వివస్త్రగా ఉండటం వల్ల యాక్సిడెంట్ కేసు కాదని బాధిత కుటుంబం బోరుమంది. లైంగిక వేధింపుల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మహిళ డెడ్ బాడీ పడి ఉన్న తీరును బట్టి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగి ఉండొచ్చని డౌట్స్ రెయిజ్ చేశారు. అయితే శవపరీక్ష నివేదిక ఈ అనుమానాలను తోసిపుచ్చింది.

జనవరి 1న మృతదేహం లభ్యమైనప్పుడు మహిళ శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. కారు చాలా దూరం ఈడ్చుకెల్లడం వల్ల తల, వెన్నుముకకు గాయాలయ్యాయి. శరీరంపై కాలిన గాయాలతో పాటు ఆమె చేతులు, కాళ్లకు గాయాలైనట్లు అనుమానించారు. శవపరీక్షలో మాత్రం అలాంటి ఆధారాలు లేవని తేలింది. ఫోరెన్సిక్స్ బృందం కారును పరిశీలించినప్పటికీ లోపల రక్తం గానీ వెంట్రుకలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. కారు కింద రక్తపు ఆనవాళ్లను కనుగొన్న ఫోరెన్సిక్ బృందం ఇది యాక్సిడెంట్ అనే చెబుతోంది.

ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. దీపక్ ఖన్నా డ్రైవింగ్ చేస్తుండగా, అమిత్ ఖన్నా, మనోజ్ మిట్టల్, క్రిషన్, మిథున్ కారులో కూర్చున్నరని పోలీసులు వెల్లడించారు. కంఝవాలాలోని జోంటి గ్రామంలో యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో కారు అండర్ క్యారేజీ కింద మృతదేహం ఇరుక్కుపోయి ఉండగా ఎవరో కారును ఆపారని పోలీసుల వెల్లడిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories