TOP 6 NEWS @ 6PM: రైలు పేరులో చిన్న తేడానే తొక్కిసలాటకు కారణమైందా?

Stampede at New Delhi Railway Station
x

New Delhi Railway Station Stampede tragedy latest news ఉపాదాట్లు: రైలు పేరులో చిన్న తేడానే తొక్కిసలాటకు కారణమైందా?

Highlights

1) Caste Census Re-Survey: తెలంగాణలో మొదలైన కులగణన రీస‌ర్వేCaste Census Re-Survey: తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలను నమోదు...

1) Caste Census Re-Survey: తెలంగాణలో మొదలైన కులగణన రీస‌ర్వే

Caste Census Re-Survey: తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలను నమోదు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు కుల గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు. దీంతో వారికోసం ఇవాళ్టీ నుంచి తెలంగాణలో రీసర్వే మొదలుపెట్టారు. ఈనెల 28వ తేదీన వరకు కులగణన వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈసారి ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ మరియు ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించింది. 040-21111111 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కుల గణనలో పాల్గొనని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

2) నీళ్లు ఏపీ తీసుకెళ్తోంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు - కేటీఆర్

KTR About Telangana share in Krishna river water: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద రావాల్సిన నీటిని ఎపీ సర్కారు తన్నుకుపోతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఏపీ సర్కారు 646 టీఎంసీల నీటిని వాడుకుందన్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు జరుగుతోందన్నారు. ఓవైపు ఏపీ కృష్ణజలాలను తరలిస్తుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ చోద్యం చూస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన న్యాయం కోసమని, కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఆ లక్ష్యాన్ని పట్టించుకోవడం మానేసిందని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటితో కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే పొలాలను ఎండబెట్టిందన్నారు. రాబోయేది ఎండాకాలం అని తెలిసి కూడా నీటిని నిల్వ చేసే విషయంలో రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎండా కాలంలో నీళ్లు లేకపోతే సాగునీరు, తాగు నీరు కష్టమవుతుందని కేటీఆర్ గుర్తుచేశారు.

3) రైలు పేరులో చిన్న తేడానే తొక్కిసలాటకు కారణమైందా?

Stampede at New Delhi Railway Station: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9:55 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో డజెన్ మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

శనివారం వీకెండ్. తెల్లవారితే ఆదివారం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లేందుకు వేల సంఖ్యలో జనం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి 10:10 గంటలకు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు రావాల్సి ఉంది. వీరంతా 13వ నెంబర్, 14వ నెంబర్ ప్లాట్‌ఫామ్స్ వద్ద రైళ్ల రాక కోసం వేచిచూస్తున్నారు.

అయితే, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఒక ట్రైన్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ పేరుతో మరొక ట్రైన్ రావడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన ప్రయాణికులు అయోమయంతో ఫ్లాట్ ఫామ్స్ మారేందుకు పరుగులు తీశారని తెలుస్తోంది. చివరి నిమిషంలో రైలు మిస్ చేసుకోకూడదనే ఆందోళనతో అందరూ పరుగులు పెట్టడం వల్లే ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

4) Rohit Sharma: రోహిత్ శర్మపై యాక్షన్ మోడ్ లో బీసీసీఐ.. టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ కన్ఫామేనా?

Rohit Sharma: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును 3-1 తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీని తర్వాత రోహిత్ శర్మపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ త్వరలో ముగియవచ్చని చాలా మంది భావించారు. అయితే, రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.

రోహిత్ శర్మపై యాక్షన్ మూడ్‌లో బీసీసీఐ సెలెక్టర్లు! భారత జట్టులో త్వరలో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ త్వరలో ముగియవచ్చు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతుంది. ఈ పర్యటనలో భారత జట్టు 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేసే మూడ్‌లో భారత సెలెక్టర్లు లేరని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రోహిత్ శర్మను టెస్ట్ జట్టు నుంచి తొలగిస్తే జట్టును ఎవరు నడిపిస్తారు? మీడియా నివేదికల ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ కావడం దాదాపు ఖాయం. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Share Market: 14 నెలల్లో 4 ట్రిలియన్ డాలర్ల నష్టం...వణుకు పుట్టిస్తున్న స్టాక్ మార్కెట్లు

Share Market: భారత స్టాక్ మార్కెట్ ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ దాదాపు రూ.45 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2024 సెప్టెంబర్ 27 నాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుండి పెట్టుబడిదారుల సంపద రూ.78 లక్షల కోట్లు తగ్గింది. గత వారం పెట్టుబడిదారులు రూ.24 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. భారత మార్కెట్ మార్కెట్ క్యాప్ 14 నెలల్లో మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది.

ఫిబ్రవరి 14, 2025న, BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ వరుసగా ఎనిమిదవ సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 199.76 పాయింట్లు తగ్గి 75,939.21 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు తగ్గి 22,929.25 వద్ద ముగిశాయి. సెప్టెంబర్ 27, 2024 నాటికి BSE-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.479 లక్షల కోట్లుగా ఉంది. ఇది జనవరి 1 నాటికి రూ.446 లక్షల కోట్లకు తగ్గింది. ఫిబ్రవరి 14 నాటికి రూ.401 లక్షల కోట్లకు తగ్గింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Tollywood: క్రేజీ కాంబినేషన్‌.. లక్కీ భాస్కర్‌ డైరెక్టర్‌తో స్టార్‌ హీరో మూవీ..!

Tollywood: నటుడిగా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. స్నేహగీతంలో మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ ఈ సినిమాలో నటించడంతో పాటు డైలాగ్స్‌ కూడా రాశారు. ఆ తర్వాత ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ, కేరింత మూవీలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేసిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు.

తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మిస్టర్‌ మజ్నూ, రంగ్‌దే వంటి మూవీలను తెరకెక్కిచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే 2023లో వచ్చిన సార్‌ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన లక్కీ భాసర్‌తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో వెంకీ అట్లూరి రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories