Tollywood: క్రేజీ కాంబినేషన్‌.. లక్కీ భాస్కర్‌ డైరెక్టర్‌తో స్టార్‌ హీరో మూవీ..!

Suriyas First Telugu Straight Film with Lucky Baskhar Director Venky Atluri reports says
x

Tollywood: క్రేజీ కాంబినేషన్‌.. లక్కీ భాస్కర్‌ డైరెక్టర్‌తో స్టార్‌ హీరో మూవీ..!

Highlights

Tollywood: నటుడిగా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. స్నేహగీతంలో మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ ఈ సినిమాలో నటించడంతో పాటు డైలాగ్స్‌ కూడా రాశారు.

Tollywood: నటుడిగా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. స్నేహగీతంలో మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ ఈ సినిమాలో నటించడంతో పాటు డైలాగ్స్‌ కూడా రాశారు. ఆ తర్వాత ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ, కేరింత మూవీలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేసిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు.

తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మిస్టర్‌ మజ్నూ, రంగ్‌దే వంటి మూవీలను తెరకెక్కిచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే 2023లో వచ్చిన సార్‌ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన లక్కీ భాసర్‌తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో వెంకీ అట్లూరి రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.

దీంతో ఈ దర్శకుడు తర్వాత ఏ సినిమా చేస్తాడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ఓ స్టార్‌ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్‌ హీరో సూర్యతో ఓ సినిమాను చేయనున్నట్లు సమాచారం. సూర్య ఇప్పటి వరకు స్ట్రెయిట్‌ మూవీ చేయలేదు. అయితే ఇటీవల తనకు తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయాలని కోరిక ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. మంచి క‌థ దొరికితే చేస్తాన‌ని చాలా సినిమా ఈవెంట్‌ల‌లో వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో సూర్య పనిచేయబోతున్నారని వార్తలొచ్చాయి.

అయితే ఇవేవి కార్యరూపం దాల్చలేవు. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories