కరోనా వైరస్‌లో మరో కొత్త వేరియంట్.. తాజాగా వెలుగులోకి వచ్చిన..

New COVID Variant: కరోనా వైరస్ రోజురోజుకు మరింత బలపడుతూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 1 Sept 2021 9:45 PM IST
New COVID Variant C.1.2 Detected in Colombia
X

కరోనా వైరస్‌లో మరో కొత్త వేరియంట్.. తాజాగా వెలుగులోకి వచ్చిన..

New COVID Variant: కరోనా వైరస్ రోజురోజుకు మరింత బలపడుతూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా C.1.2గా పిలిచే ఓ వేరియంట్‌ బయటపడింది. అయితే తాజాగా మరో ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చింది. 'మూ' వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడినట్లు W.H.O ప్రకటించింది. ప్రస్తుతం 'మూ'ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్లు W.H.O. తెలిపింది. తాజాగా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే 'మూ' వేరియంట్‌ వెలుగుచూడడం ప్రపంచ శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story