సీఎంగా నితీష్.. రేపే ప్రమాణం

సీఎంగా నితీష్.. రేపే ప్రమాణం
x
Highlights

బీహార్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకి తెరపడింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వీషయాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది.

బీహార్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకి తెరపడింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వీషయాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆద్వర్యంలోని ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలు సమావేశం కాగా, ఈ భేటిలో శాసనసభ పక్ష నేతగా నితీష్ ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీనితో నితీష్ కుమార్ నాలుగోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అటు డిప్యూటి సీఎంగా సుశీల్ మోడీకి అవకాశం దక్కనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకోగా, అవామీ మోర్చా, వికాస్‌ వీల్‌ హిన్సాన్‌ చెరో 4 చోట్ల గెలుపొందింది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో బీజేపీ కీలక పదవులబను ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories