Even Indira Gandhi, Atal Bihari Vajpayee Lost in Elections : బీజేపీపై పవార్ విమర్శలు

Even Indira Gandhi, Atal Bihari Vajpayee Lost in Elections : బీజేపీపై పవార్ విమర్శలు
x
Sharad Pawar (File Photo)
Highlights

భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ మరోసారి కీలక వాఖ్యలు చేశారు. ఓటర్లను ఎప్పుడు కూడా

భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ మరోసారి కీలక వాఖ్యలు చేశారు. ఓటర్లను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దనిఅన్నారు. ఓటమికి ఎవరూ అతీతులు కాదని, ఇందిర, వాజ్‌పేయి వంటి మహామహా నాయకులనే ఎన్నికల్లో ఓటర్లు ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు పవార్ .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయన ఈ వాఖ్యలు చేశారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేను మళ్ళీ తిరిగి వస్తానని అతి విశ్వాసం ప్రదర్శించి బొక్కబోర్లాపడ్డారని అన్నారు పవార్.. ఎప్పుడూ తామే అధికారంలో ఉంటామనే అహంబావం పనికిరాదని అన్నారు. ఆయన అహంకారాన్ని గుర్తించిన ప్రజలు ఆయనకి తగిన గుణపాఠం చెప్పారని పవార్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల కంటే సామాన్యులే తెలివైనవారని అన్నారు.

ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ పైన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో తనకు ఉన్న విభేదాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, పవార్ స్పందిస్తూ " ఖచ్చితంగా కాదని, అలాంటిది ఏమీ లేదని పేర్కొన్నారు. విభేదాలకు ఆస్కారమే లేదని, లాక్‌డౌన్ సమయంలో సీఎంకు, తనకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉందన్నారు. రాబోయే కాలంలో కూడా ఇదే మాదిరి కలసికట్టుగా పనిచేస్తామని పవార్ స్పష్టం చేశారు.

ఇక కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ విధించడం వలన వార్తల సేకరణ కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, వార్తాపత్రికల పేజీలను నింపాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన మీడియాను సూచించారు. అటు సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని మీడియా రాస్తున్న కథనాల్లో నిజం లేదని అయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.Even Indira Gandhi, Atal Bihari Vajpayee Lost in Elections : బీజేపీపై పవార్ విమర్శలు

Show Full Article
Print Article
Next Story
More Stories