Sushant Singh case: అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్..

డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది.. ఈ కేసులో అరెస్టు చేసిన ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా మంగళవారం..

Raj
By Raj
Updated on: 9 Sept 2020 7:31 AM IST
Sushant Singh case:  అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్..
X

డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. అలాగే మంగళవారం ఆమెను అరెస్టు చేసిన తరువాత 14 రోజుల రిమాండ్ విధించారు ఈ సమయంలో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారని కోర్ట్ స్పష్టం చేసింది.

మంగళవారం రాత్రి 7.30 గంటలకు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్‌సిబి చక్రవర్తిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మాదకద్రవ్యాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), రియా చక్రవర్తిపై రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ సేకరించినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా మంగళవారం మధ్యాహ్నం చక్రవర్తిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు, ఎన్‌సిబి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్‌తో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది.. వీరిలో రాజ్‌పుత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, ఇంటి పనిమనిషి దీపేశ్ సావంత్ కూడా ఉన్నారు.

మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్‌సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే బాలీవుడ్‌ నటుడు సుశాంత్ రాజపుత్‌ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తి అతని ప్రియురాలిగా ఉన్నారు. ఆమెను మూడు రోజుల విచారణ అనంతరం ఎన్‌సీబీ ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్‌ ఛాట్స్‌ ఆధారంగా ఆధారాలు సేకరించారు. రియా అరెస్టుతో డ్రగ్స్ కొనుగోలు దారులలో టెన్షన్ మొదలయింది.

Raj

Raj

Next Story