Haryana: హర్యానాలో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ

Haryana: సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ

Shashank Gullapelli
Published on: 13 March 2024 2:43 PM IST
Nayab Saini-Led Government Wins Vote Of Confidence By Voice Vote
X

Haryana: హర్యానాలో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ

Haryana: హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకుంది. అసెంబ్లీ నిర్వహించిన బలనిరూపణలో సైనీ సర్కార్ నెగ్గింది. సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకల కారణంగా జేజేపీతో బంధం తెంచుకున్న బీజేపీ.. నిన్న సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఇవాళ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి పద్ధతిన సభ్యులు ఓటు వేయగా.. 41 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర్య అభ్యర్థులు సైనీ సర్కార్‌కు మద్దతు తెలిపారు. బలపరీక్ష ఓటింగ్‌కు జేజేపీ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story