Navjot Singh Sidhu: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. సిద్ధూ రాజీనామా...

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది.

Arun Chilukuri
Published on: 28 Sept 2021 3:26 PM IST
Navjot Singh Sidhu Resigns as Punjab Congress Chief
X

Navjot Singh Sidhu: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. సిద్ధూ రాజీనామా...

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ తాజాగా పార్టీకి కూడా గుడ్ బై కొడతారన్న ప్రచారాల నేపధ్యంలో పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత ఘర్షణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సిద్దూ దేశద్రోహి అని ఆతని హయాంలో పంజాబ్ లో కాంగ్రెస్ నాశనం ఖాయమని ఇప్పటికే ప్రకటించిన అమరీందర్ పార్టీకే గుడ్ బై కొట్టే ఆలోచనలో ఉన్నారు. అమరీందర్ ఢిల్లీ బయల్దేరడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. పార్టీలో ఇద్దరూ రెండు గ్రూపులకు సారధ్యం వహిస్తుండటంతో పార్టీ మనుగడ కష్టంగా మారుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story