National Farmers Day 2019 : రైతును రక్షించే ఉద్యమం రావాలి!

National Farmers Day 2019 : రైతును రక్షించే ఉద్యమం రావాలి!
x
Highlights

అన్నదాత.. దానం ఇచ్చే వారిని దాత అంటాము. ఆ దానం పుచ్చుకున్న వారు దాతల పట్ల కృతజ్నతా భావంతో ఉంటారు. ఉండాలి కూడా. కానీ.. ఆరుగాలం శ్రమించి.. ఐదు వేళ్ళతోనూ...

అన్నదాత.. దానం ఇచ్చే వారిని దాత అంటాము. ఆ దానం పుచ్చుకున్న వారు దాతల పట్ల కృతజ్నతా భావంతో ఉంటారు. ఉండాలి కూడా. కానీ.. ఆరుగాలం శ్రమించి.. ఐదు వేళ్ళతోనూ నోటికి అన్నం తినేలా చేసే రైతన్న పట్ల కనీస ఆధారం కూడా చూపించలేకపోతున్నాము. ఎండా..వానా.. వరదా..బురదా.. అన్నిటినీ సమానంగా భరించి.. తాను నమ్ముకున్న నేలతల్లి నుంచి జన జీవితాల్ని నిలబెట్టే పట్టేడన్నాన్ని పెట్టె కిసాన్ మిత్రులు ఇప్పుడు కష్టాల ఊబి లో ఉన్నారు. తామే బతకలేని పరిస్థితుల్లో తాము నమ్ముకున్న పుడమి మాతను విడిచిపెట్టి వలసలు పోతున్నారు. క్రమేపీ తమ ఉన్నతమైన వృత్తిని వదిలి పెట్టి పక్కకు జరుగుతున్నారు. ఎందుకీ పరిస్థితి? తప్పెవరిది? రైతన్న కోసం మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఈ రోజు డిసెంబర్ 23 భారత దేశపు జాతీయ రైతు దినోత్సవం. ఈ సందర్భంగా ఒక్కసారి రైతుల దుస్థితికి కారణాలపై ఓ అవలోకనం!

పుడమి తల్లి నుంచి అందరి ఆకలి తీర్చే అమృతాన్ని సృష్టించే రైతు ప్రస్తుత పరిస్థితి దీనంగా ఉందనడం లో సందేహం లేదు. ఒక్కటి కాదు రెండు కాదు సమస్యల సుడిలో మన దేశంలో రైతన్నలు కుదేలైపోతున్నారు.

మారిన కాలం..

కాలం మారిపోతోంది. ఇలా అనడం కన్నా.. మనమే మార్చేసాం అనడం సబబుగా ఉంటుందేమో. వేగవంత మైన..విలాస వంతమైన జీవితం కోసం ప్రకృతిని సర్వనాశనం చేసేసాం. చేసేస్తున్నాం. దీంతో ఎండలు కాయాల్సిన సమయంలో వరదలు.. వర్షాలు కురిసే సమయంలో మనిషి ఉసురు తీసేంత వేడి.. ఇలా కాలం మారిపోయింది. తొలకరి కోసం చూసి.. కార్తెలు లెక్కల్లో చేసే సంప్రదాయ వ్యవసాయ కాలమానాలు ఇప్పుడు లేకుండా పోయాయి. అయితే, మారుతున్న కాలానికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే దారులు రైతులకు చేరువ కాలేదండంలో సందేహం లేదు. ఇప్పటికీ పల్లెల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పంటని నిలువునా ముంచే పురుగు మందుల వ్యాపారం చేసుకునే వారున్నారు కానీ, వారికి కావలసిన విజ్ఞానాన్ని అందించే వారు లేకపోవడమే విషాదం. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన విజ్ఞానాన్ని అందించలేకపోవడం పుడమి తల్లిని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్ని వారి వృత్తికి దూరం చేసేస్తోంది.

ఆధునిక పోకడలు..

పచ్చని పంట పొలాల్ని అభివృద్ధి పేరుతొ రియల్ ఎస్టేట్ కాంక్రీటుగా మార్చేస్తున్నారు. వ్యవసాయం దండగ గా మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక తమ బ్రతుకు కోసం తాము నమ్మిన నేలను అమ్ముకుని అన్నదాత కాస్తా కాంక్రీట్ జంగిల్ లో కాపురానికి తరలి పోతున్నాడు.

ఇలాంటి ఎన్నో కారణాలు వ్యవసాయం దండగ అనే పరిస్థిలు తీసుకు వస్తున్నాయి. పెద్ద పండగ సంక్రాతి వచ్చిందంటే.. రైతన్నల ఇళ్ల ముందు ముత్యాల ముగ్గులు బంధు మిత్రుల కోలాహలం ఇవన్నీ పంట వచ్చిన ఆనందం లో సరదాగా సంబరంగా జరుపుకునే వారు. ఇప్పుడు సంక్రాంతి ఒక పండగ అంతే. పంట చేతికి వచ్చింది అనే ఆనందం లేదు.. పచ్చని పొలాల మధ్య భోగిమంటల భోగం లేదు. క్రమేపీ ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే రైతు అనే పదాన్నే భావి తరాలు మర్చిపోతాయి.

రైతన్నను రక్షించుకోవడం ఎలా..

ఇప్పుడు మనకి కావలసింది మీటూ ఉద్యమాలు ఒక్కటే కాదు. అదే తరహాలో మనకి పట్టెడన్నం పెట్టె రైతుల సమస్యల్ని పరిష్కరించే దిశలో సేవ్ ఫార్మర్ ఉద్యమం కావాలి. రైతన్న విలువని నవతరానికి తెలియ చెప్పే ఉద్యమం కావలి. రైతన్న కంట కన్నీరు మన దేశాన్ని ప్రళయంలో చూట్టేయక ముందే ఓదార్పు నిచ్చే ఉద్యమం మొదలు కావాలి. రైతు అంటే ఏమిటో భావితరాలకు తెలిపే ఉద్యమం రావాలి. వ్యవసాయం దండగ కాదు పండగ అనే వాతావరణాన్ని దేశంలో సృష్టించాలి.

ఈ సంవత్సరం భారత దేశంలో ఈ రోజు జరుపుకుంటున్న రైతు దినోత్సవం సందర్భంగా ఆ దిశలో ప్రయత్నాలు జరగాలని ఆశిద్దాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories