PM Modi: ఫైన‌ల్‌లో ఓట‌మి.. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌ధాని మోదీ

PM Modi: మోడీ డ్రెస్సింగ్‌రూమ్‌ వచ్చిన ఫొటో షేర్ చేసిన రవీంద్ర జడేజా

Shekhar G
Published on: 20 Nov 2023 6:25 PM IST
Narendra Modi Went Into The Dressing Room And Console The Indian Players
X

PM Modi: ఫైన‌ల్‌లో ఓట‌మి.. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌ధాని మోదీ

PM Modi: వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి ప్రజలతో పాటు ఆటగాళ్లను బాధకు గురిచేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిశాక టీమిండియా ప్లేయర్స్ కన్నీటి పర్యంతమయ్యారు. అహ్మదాబాద్‌‌ మ్యాచ్ వీక్షించిన మోడీ ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌‌కు వెళ్లారు. తీవ్ర విచారంలో ఉన్న భారత ఆటగాళ్లను ఓదార్చారు. పేరు పేరునా పలకరిస్తూ వారితో మాట్లాడారు.

దీనికి సంబంధించిన ఫొటోను రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరల్డ్ కప్‌ లో తాము సమున్నతంగా రాణించామని... కానీ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని జడేజా పేర్కొన్నారు.తమ మనసంతా వికలమైపోయిందని.. ప్రజల మద్దతు తమకు ఓదార్పు లభిస్తోందని తెలిపారు. మ్యాచ్ ముగిశాక ప్రధాని మోడీ డ్రెస్సింగ్ రూమ్‌కు రావడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిచిందని జడేజా వివరించారు.


Shekhar G

Shekhar G

Next Story