Narada Scam Case: బెంగాల్‌ మంత్రులకు బెయిల్‌

Narada Scam Case: బెంగాల్‌లో ఎన్నికల అనంతరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Samba Siva Rao
Updated on: 17 May 2021 9:30 PM IST
Narada Scam Case: బెంగాల్‌ మంత్రులకు బెయిల్‌
X

Narada Scam Case: బెంగాల్‌లో ఎన్నికల అనంతరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నార‌ద స్కామ్ కేసులో టీఎంసీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. అంత‌క‌కుముందు ఈ ఘట‌న‌పై మ‌మ‌తా బెన‌ర్జీ మండిప‌డ్డారు. సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని ఆరోపిస్తున్నారు. మంత్రుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు

టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. రాజ్యాంగ నిమయాలను పాటించాలని కోరారు.

2016 అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ను కుదిపేసిన నారద టేపుల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలం సద్దుమణిగిందనుకున్న ఈ కేసుపై సీబీఐ విచారణకు గవర్నర్ అనుమతించి వివాదానికి తెరతీశారు. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు ఇద్దరు మంత్రులను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. ఇందులో మంత్రి ఫిర్హాద్ హకీమ్‌ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవలే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద టేపుల వ్యవహారంపై విచారణకు సీబీఐకి అనుమతించారు. నారద టేపుల కుంభకోణం కేసులో గత క్యాబినెట్‌లోని నలుగురు మంత్రుల పాత్రపై విచారణకు బీజేపీ డిమాండ్ చేయడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story