Nagma: నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా?.. కాంగ్రెస్‌పై నగ్మా అసంతృప్తి

Nagma dissatisfied with Congress | National News
x

Nagma: నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా?.. కాంగ్రెస్‌పై నగ్మా అసంతృప్తి

Highlights

Nagma: కాంగ్రెస్‎ను ఏవగించుకుంటున్న నగ్మా అంతరంగం

Nagma: మొన్న జరిగిన చింతనా శివిర్ లో ఏం చింతించారో గానీ కాంగ్రెస్ లో ఉన్నందుకు మాత్రం కొందరు టాప్ లీడర్స్ బాగా చింతిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పరుగులు పెట్టించాలని ఉదయ్‎పూర్‎ సదస్సులో తీర్మానమైతే చేశారు గానీ అక్కడి తీర్మానాలేవీ పార్టీకి ఏమాత్రం పనికొచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే పార్టీనే నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ ముఖారవిందాలకూ అక్కడ స్థానం లేదని తేలిపోయింది. నిన్న, మొన్నటి అందాల నటి నగ్మా కూడా కాంగ్రెస్‎ మీద తీవ్రమైన మనస్తాపం చెంది అసహ్యించుకుంటున్నారు.

నగ్మా ఎ బ్యూటిఫుల్ గాళ్ ఫ్రమ్ ముంబై. చక్కని అందంతో పాటు ఆకట్టుకునే నటన, బాలీవుడ్ స్టార్స్‎కు తగిన జోడీగా కాసులు కురిపించిన చరిష్మా ఆమెది. కానీ ఎందుకో ఆమె అందం గానీ, పాపులారిటీ గానీ కాంగ్రెస్ కు పనికిరాలేదు. పూర్తి సెక్యులర్ భావాలతో, ప్రజలందరినీ కలిపి ఉంచే సైద్ధాంతిక భూమిక మీద రాజకీయాల్లో పని చేయాలని, తనదైన శైలిలో ప్రజలకు సేవ చేయాలని.. పాపం ఎంతో తహతహలాడారు నగ్మా. కానీ ఆమె ఆశలను, ఆశయాలను క్యారీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఆమెకు ఈ విషయం తెలిసొచ్చేసరికే 18 ఏళ్ల విలువైన కాలం వృథాగా కరిగిపోయిందని తెగ బాధపడుతున్నారిప్పుడు. రాజీవ్‎గాంధీ మీద ఉండే ఆరాధనా భావంతో ఆమె 2003లో కాంగ్రెస్ లో చేరారు.

అయితే అప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా ఫెమిలియర్ నటి. చిరంజీవి వంటి మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కనుక.. ఆమెను తెలుగు వోటర్లు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని భావించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆమెను 2004 ఎన్నికల్లో ప్రచారంలోకి దింపారు. ఒక్క తెలుగులోనే కాదు.. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె నటించారు. ఆమె అందానికి, అభినయానికి మాంచి డిమాండ్ ఉందని గ్రహించిన కాంగ్రెస్ హైకమాండ్ అప్పుడే నగ్మాకు బలమైన హామీ ఇచ్చింది. పార్టీలో మంచి పొజిషన్ ఉంటుందన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా ఆమెకు ప్రయారిటీ ఉంటుందన్నారు. సోనియా, రాహుల్ మీద నమ్మకమే ఆమెను ఇంతకాలం కాంగ్రెస్ ను అంటిపెట్టుకునేలా చేసింది.

తాజాగా రాజ్యసభకు 57 మందిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. 15 రాష్ట్రాల నుంచి 57 మంది ఎంపిక కోసం ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలను బట్టి అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్.. మహారాష్ట్రకు నాన్ లోకల్ అయిన ఇమ్రాన్ ప్రతాప్ గఢీ అనే ఓ యువ కవిని ఎంపిక చేసింది. ఇతను యూపీకి చెందిన వ్యక్తి. అయితే తనకు రాజ్యసభకు అవకాశం రాకపోయినా నగ్మా ఇంతగా బాధపడేవారు కాదేమో.. ఎవరికీ తెలియని, నాన్-లోకల్ అయిన ఇమ్రాన్ ను మహారాష్ట్ర నుంచి ఎంపిక చేయడమే పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తోంది. అందుకే 18 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం ఇలా ఉంటుందని ఊహించలేకపోయాను.

అంటూ నమ్ముకున్న పార్టీ మీద గూడు కట్టుకున్న నిస్పృహను నిర్మొహమాటంగా బయటపెట్టారు నగ్మా. ఇంతకాలం నమ్మి ఉన్నందుకు, ఎదురుచూపులు చూసినందుకు తగినశాస్తే జరిగిందంటూ తన మూర్ఖత్వాన్ని తానే నిందించుకుంటున్నారిప్పుడు. కాంగ్రెస్‎ది ప్రో-పీపుల్ ఫిలాసఫీ అని భావించానని, అందువల్ల అందులో పదవి వస్తే ప్రజలకు ఏమైనా చేయడానికి అవకాశం వస్తుందని, జుగుప్సాకరమైన మత విద్వేషాలు చిమ్ముతున్న ప్రస్తుత రోజుల్లో తనలాంటి ప్రో-పీపుల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్లే కాస్తయినా చేయగలరని భావించిన నగ్మా.. తన కలలు తీరే మార్గాలన్నీ క్లోజ్ అయిపోయాయని అంతర్మథనం చెందుతున్నారు.

నగ్మా కేవలం అందగత్తె మాత్రమే కాదు. కాంగ్రెస్ పొలిటికల్ ఫిలాసఫీకి సరిపడిన ప్రొఫైల్ కూడా ఆమె సొంతం. ఆమె తల్లి సీమా అలియాస్ షామా కాజీ. తల్లి తరఫు తాతలకు ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న బ్యాగ్రౌండ్ ఉంది. అయితే సీమా అర్వింద్ మొరార్జీని మతాంతర వివాహం చేసుకుంది. తండ్రి తరఫు తాతలు గుజరాత్ లో అప్పటికే బలమైన వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. అయితే నగ్మా తల్లీ-తండ్రీ వివాహమైతే చేసుకున్నారు గానీ నగ్మాకు జన్మనిచ్చేనాటికే డైవోర్స్ తీసుకున్నారు. సర్వమత సమభావనకు ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‎గా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నగ్మా హిందూ-ముస్లిం అనే తేడాలకు ఎక్కడా చోటివ్వలేదు. తల్లిదండ్రుల డైవోర్స్ గురించి కూడా నగ్మా ఎక్కడా రివీల్ చేసిన దాఖలాల్లేవు. బహుశా అందువల్లేనేమో తనకు సూటబుల్ పార్టీగా కాంగ్రెస్‎నే ఎంచుకున్నారు.

అయితే తన సెలెక్షన్ రాంగ్ సెలెక్షన్ అని తెలుసుకోవడానికి నగ్మా 18 ఏళ్లు సుదీర్ఘంగా ప్రయాణించాల్సి వచ్చింది. 2014లో యూపీ నుంచి లోక్‎సభకు పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. అక్కడ ఓడిపోయాక నగ్మా రాజకీయ రంగం నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. అయితే మరో విశేషమేంటంటే నగ్మా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు అందుతుండగానే బీజేపీ నేతలు ఆమెను కాషాయం వైపు లాగేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమెతో రాయబారం కూడా నడిపారు. కానీ నగ్మా తన భావాలతో రాజీపడలేక కాంగ్రెస్ నే ఎంచుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అయితే కాలం కలిసి రాకపోవచ్చు గానీ రాజకీయాల మీద ఆసక్తి మాత్రం తగ్గలేదని డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు నగ్మా. మరి తాను కోల్పోయిన అవకాశాన్ని బీజేపీలో పూడ్చుకుంటారా తత్వం బోధపడింతర్వాత ప్రయాణాన్ని మార్చుకుంటారా? ఏమో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories