Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్ ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్ ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే హవా
Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్ బైపోల్‌లో, అధికార టీఆర్ఎస్‌దే విజయమని జోస్యం చెప్పాయి పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్.
Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్ బైపోల్‌లో, అధికార టీఆర్ఎస్‌దే విజయమని జోస్యం చెప్పాయి పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్. గులాబీ అభ్యర్థిదే విజయమని తేల్చాయి. కాంగ్రెస్‌కు రెండోస్థానం, బీజేపీకి మూడోస్థానమని అభిప్రాయపడ్డాయి.
తెలంగాణలో హైఓల్టేజ్ క్రియేట్ చేసిన బైపోల్, నాగార్జున సాగర్. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఎవరు గెలుస్తారు ఫలితాలు ఎప్పుడెప్పుడా అన్న ఉత్కంఠ రోజురోజకు పెరిగింది. కొన్ని సర్వే సంస్థలు, బైపోల్ ఫలితంపై కొన్ని అంచనాలు ప్రకటించాయి. మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్‌దే విజయమని మిషన్ చాణక్య, ఆరా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 49.24 శాతం ఓట్లతో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని అభిప్రాయపడింది. ఇక 37.92 ఓట్ల శాతంతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలుస్తారని అంచనా వేశాయి సర్వే సంస్థలు. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోకతప్పదని, దాని ఓట్ల శాతం కేవలం 7.80 శాతమని వెల్లడించాయి. స్వతంత్రుల అభ్యర్థుల ఓటింగ్ 5.04 శాతమని తెలిపింది మిషన్ చాణక్య.
ఇక ఆరా సర్వే కూడా సాగర్‌లో టీఆర్ఎస్‌కే ఓటేసింది. 50.48 శాతం ఓట్లతో గులాబీ అభ్యర్థి విజయం ఖాయమని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 39.93 శాతం ఓట్లని అభిప్రాయపడింది. బీజేపీకి ఆరా ఇచ్చిన ఓట్లు కేవలం 6.31 శాతం. స్వతంత్రుల ఓట్ల శాతం 3.28. మొత్తానికి సాగర్ సమరంలో గులాబీ దండుదే విజయమని తేల్చాయి ఎగ్జిట్‌పోల్స్. మే 2న అసలైన ఫలితం రాబోతోంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT