Tamil Nadu: తమిళనాడును 'ఉత్తమ రాష్ట్రం'గా తీర్చిదిద్దాలన్నదే నా కల- స్టాలిన్​

Tamil Nadu: తమిళనాడులో పారదర్శకత, నిజాయతీతో కూడిన పాలనను అందిస్తానని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 10 May 2021 10:36 AM IST
My Dream is to Make Tamil Nadu the Best State Says MK Stalin
X

Tamil Nadu: తమిళనాడును 'ఉత్తమ రాష్ట్రం'గా తీర్చిదిద్దాలన్నదే నా కల- స్టాలిన్

Tamil Nadu: తమిళనాడులో పారదర్శకత, నిజాయతీతో కూడిన పాలనను అందిస్తానని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ప్రజల కోసమే ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. తమిళనాడును 'ఉత్తమ రాష్ట్రం'గా తీర్చిదిద్దాలన్నదే తన కల అన్నారు. ప్రభుత్వాన్ని తన నాయకత్వంతో నడిపినా.. తాను డీఎంకే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా.. ఇది పార్టీ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుందన్నారు. రాష్ట్రంలో పారదర్శకత, నిజాయతీతో కూడిన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story