అమెరికా విమానం కోసం పోలీసులు రెడీగా ఉన్నారు... దిగగానే ఇద్దరినీ అరెస్ట్ చేశారు

murder case accused arrested after US deportation flight landed in amritsar Airport
x

అమెరికా విమానం కోసం పోలీసులు రెడీగా ఉన్నారు... దిగగానే ఇద్దరినీ అరెస్ట్ చేశారు

Highlights

Murder case accused arrested at Amritsar AirportMurder case accused arrested at Amritsar Airport: శనివారం రాత్రి అమృత్‌సర్‌లో ఒక సినిమాటిక్ సీన్...

Murder case accused arrested at Amritsar Airport

Murder case accused arrested at Amritsar Airport: శనివారం రాత్రి అమృత్‌సర్‌లో ఒక సినిమాటిక్ సీన్ చోటుచేసుకుంది. అమెరికాలో ఉన్న అక్రమవలసదారులతో బయల్దేరిన అమెరికా మిలిటరీ విమానం శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంది. ఆ విమానం కోసం అందులో వస్తోన్న వారి కుటుంబాలు కూడా ఎయిర్ పోర్ట్ బయట వేచిచూస్తున్నాయి. వారితో పాటే పంజాబ్‌లోని పటియాల జిల్లా పోలీసులు కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రాత్రి 11:40 గంటలకు అమెరికా విమానం ల్యాండ్ అయింది. విమానంలోంచి అక్రమవలసదారులు ఒక్కొక్కరిగా దిగి బయటికొచ్చారు. వారిని కలిసేందుకు వారి కుటుంబాలు పోటీపడుతున్నాయి. కానీ అంతకంటే ముందుగా విమానం దిగి వచ్చిన వారిలో ఇద్దరిని పోలీసులు కలిశారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, మిలిటరీ వారు విమానం ఎక్కించే ముందు వేసిన సంకెళ్లు తీయగానే పంజాబ్ పోలీసులు ఆ ఇద్దరికి సంకెళ్లు వేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు సందీప్ సింగ్ అలియాస్ సన్నీ. మరొకరు పేరు ప్రదీప్ సింగ్.

2023 జూన్‌లో పటియాల జిల్లాల్లో జరిగిన ఒక మర్డర్ కేసులో ఈ ఇద్దరూ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో ఉన్నారు. రాజ్‌పుర పోలీసు స్టేషన్‌లో వారిపై మర్డర్ కేసు నమోదైంది. కొద్దిరోజుల పాటు విచారణ కూడా జరిగింది. కానీ అంతలోనే ఈ కేసు విచారణ తప్పించుకునేందుకు దొంగ దారిలో అమెరికా వెళ్లిపోయారు. అమెరికా ప్రభుత్వం వారిని అక్రమ వలసదారుల కింద అరెస్ట్ చేసి తిరిగి భారత్ కు పంపించింది.

అమెరికా నుండి వస్తోన్న విమానంలో సందీప్ సింగ్, ప్రదీప్ సింగ్ వస్తున్నారని తెలుసుకున్న పాటియాలా పోలీసులు అమృత్‌సర్ పోలీసులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. వారు ఇండియాలో కాలుపెట్టగానే అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరికీ మర్డర్ కేసులో చట్టప్రకారం శిక్షపడేలా చూస్తామని రాజ్ పుర పోలీసులు తెలిపారు. ఈ అరెస్ట్‌ను పటియాల జిల్లా ఎస్ఎస్పీ నానక్ సింగ్ కూడా నిర్ధారించారు.

Real Story: అప్పు చేసి కొడుకును అమెరికా పంపించారు... 8 నెలల్లో రెండుసార్లు డిపోర్టేషన్

10 రోజుల క్రితమే రూ. 90 లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్లారు... అప్పుడే తిప్పి పంపించారు

అమెరికా విమానాలు అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు.. పంజాబ్ సీఎం అనుమానాలు

Show Full Article
Print Article
Next Story
More Stories