Mumbai Lift Blast: ముంబయిలో షాకింగ్ ఘటన: లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థిని!

Mumbai Lift Blast: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పెను ప్రమాదం తప్పింది. గోరెగావ్‌ (వెస్ట్‌)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో లిఫ్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 11:22 AM IST
Mumbai Lift Blast: ముంబయిలో షాకింగ్ ఘటన: లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థిని!
X

Mumbai Lift Blast: ముంబయిలో షాకింగ్ ఘటన: లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థిని!

Mumbai Lift Blast: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పెను ప్రమాదం తప్పింది. గోరెగావ్‌ (వెస్ట్‌)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో లిఫ్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వైద్య విద్యార్థినితో పాటు బెలూన్లు డెలివరీ చేసే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

గోరెగావ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరగనున్న వేడుక కోసం రాజ్‌కుమార్ మహతో అనే వ్యక్తి గ్యాస్ బెలూన్లను డెలివరీ చేయడానికి వచ్చాడు. అతను బెలూన్లతో లిఫ్ట్‌ ఎక్కగా, అదే సమయంలో హిమానీ అనే వైద్య విద్యార్థిని, మరో యువకుడు కూడా లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. లిఫ్ట్ కదలకముందే, రాజ్‌కుమార్ చేతిలో ఉన్న బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లో లిఫ్ట్ అంతా మంటలు వ్యాపించాయి. భయంతో ముగ్గురూ బయటకు పరుగులు తీసినప్పటికీ, రాజ్‌కుమార్, హిమానీలు అగ్నికీలల వల్ల గాయపడ్డారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. బెలూన్ల దుకాణం యజమాని టీకే జైశ్వాల్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story