ముంబై డ్రగ్స్‌ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్ట్‌

Mumbai Drugs Mafia: ముంబై డ్రగ్స్‌ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్ట్‌...ముంబైలో టోనీని అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు.

Sriveni Erugu
Published on: 20 Jan 2022 7:28 PM IST
Mumbai Drugs Mafia Chief Accused Tony Arrested
X

ముంబై డ్రగ్స్‌ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్ట్‌..

Mumbai Drugs Mafia: డ్రగ్స్ మాఫియా ప్రధాని నిందితుడు టోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకుని తిరుగుతున్న టోనీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న టోనీ.. దేశంలోని ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ద్వారా హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. టోనీతో పాటు తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ వద్ద డ్రగ్స్‌ తీసుకున్న వారిలో ఎక్కువగా రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story