Parliament: అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్‌ను బెదిరించిన శివసేన ఎంపీ
Parliament: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే యాసిడ్ పోస్తారా..? అవుననే అంటున్నారు అమరావతి నుంచి లోక్‌సభకు ఎన్నికైన స్వతంత్ర ఎంపీ నవనీత్‌కౌర్.
Parliament: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే యాసిడ్ పోస్తారా..? అవుననే అంటున్నారు అమరావతి నుంచి లోక్‌సభకు ఎన్నికైన స్వతంత్ర ఎంపీ నవనీత్‌కౌర్. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించినట్లు లోక్‌సభలోనే ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్‌తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరిస్తే తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని కూడా అరవింద్ అన్నారు.
Next Story




