Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి

Nama Nageswara Rao: బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలి

Shekhar G
Published on: 18 Sept 2023 6:23 PM IST
Mp Nama Nageswara Rao Demanded That The New Parliament Building Should Be Named After Ambedkar
X

Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి

Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్‌లో నామా మాట్లాడారు. కేసీఆర్ పరిపాలన వల్ల తెలంగాణ అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. 46.46ధు పథకం ద్వారా దళితులకు 10లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story