కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఖర్గేకు అభినందనలు తెలిపిన వెంకట్‌రెడ్డి

Jyothi
Updated on: 14 Dec 2022 6:27 PM IST
MP Komatireddy Venkat Reddy Meet Congress President Kharge
X

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఖర్గేకు వెంకట్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాజకీయ పరిస్థితులు, నేతలు పార్టీ వీడటంపై చర్చించినట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్‌రెడ్డి, వెంకట్ రాంరెడ్డి సహా పలువురు సీనియర్లు.. పార్టీకి రాజీనామా చేయడంపై ఖర్గేకు వివరించినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు ఖర్గేతో సమావేశమైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ కమిటీల వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story