కొత్త చట్టం వచ్చాక వెలుగులోకి వింత ఫైన్లు..ఫైన్ వేయాలంటే.. కారణమే ఉండక్కరలేదు

కొత్త చట్టం వచ్చాక వెలుగులోకి వింత ఫైన్లు..ఫైన్ వేయాలంటే.. కారణమే ఉండక్కరలేదు
x
Highlights

మీరు రోడ్డు మీద వెళ్తున్నారా? హెల్మెట్ కూడా పెట్టుకున్నారా? సీటు బెల్ట్ సైతం పెట్టుకున్నారా? మీ వెహికిల్ పేపర్లన్నీ మీ వద్దే ఉన్నాయా? రూల్స్ అన్నీ...

మీరు రోడ్డు మీద వెళ్తున్నారా? హెల్మెట్ కూడా పెట్టుకున్నారా? సీటు బెల్ట్ సైతం పెట్టుకున్నారా? మీ వెహికిల్ పేపర్లన్నీ మీ వద్దే ఉన్నాయా? రూల్స్ అన్నీ పద్ధతిగా పాటిస్తున్నారా? అయినా సరే, మీకు ఫైన్ పడొచ్చు?!

అవును అన్నీ ఉన్నా, సరిగ్గానే ఉన్నప్పటికీ ఈ ఫైన్లేంటని ఆలోచిస్తున్నారా? నిజమే మీరు విన్నది నిజమే నేను చెబుతున్నదీ నిజమే. కొత్త వాహన చట్టం వచ్చాక రూల్స్ మారాయి. అదేనండి రూల్స్ మరింత పకడ్బందీగా అయ్యాయి. కానీ, మరీ ఇంతగా మాత్రం కాలేదు. లేకపోతే ఏంటండి? మరీను జస్ట్ చొక్కా గుండీలు పెట్టుకోలేదని కూడా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారా?

కొత్తగా వెహికిల్ యాక్ట్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. కాజ్ ఏదైనా సరే, ఫైన్లు వేసి కానిచ్చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేదనో, ఎద్దుల బండి నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదనో, లుంగీతో వెళుతున్నాడనో కాగితాలు చూపించలేదనో రకరకాల కారణాలతో వింతగా వితండంగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేశారు. ఇలాంటివెన్నో మనం చూశాం. కానీ మరీ ఇలాంటి ఘటన చూసి ఉండరు.

జస్ట్ గుండీలు పెట్టుకోలేదన్న కారణంతో ఓ ట్రాఫిక్ పోలీసు, ఏకంగా వాహనదారుడిపై ఫైన్ వేశాడు. రాజస్థాన్ లో మథోసింగ్ అనే ట్యాక్సీ డ్రైవర్ చెప్పులు వేసుకున్నాడు. కానీ, చొక్కా గుండీలు పెట్టుకోలేదు. అలాగని మిగతా ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాడు. ఆ ట్రాఫిక్ పోలీసాయనకు బహుషా ఏ తప్పు కనిపించనట్లుంది. పైగా ఫైన్ వేయాలంటే ఏదో కారణం కూడా ఉండాలి కదా! అందుకే చొక్కా గుండీలు పెట్టుకోలేదు కాబట్టి ఫైన్ వేసేశాడు. ఫైన్ వేశాక ఏమనుకున్నాడో ఏమో కానీ, ఆ ట్యాక్సీ డ్రైవర్ కి ఓ చిన్న మినహాయింపు కూడా ఇచ్చాడు. జరిమానా మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుందని ముక్తాయించాడు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే కేంద్రం రూపొందించిన వెహికిల్ న్యూ యాక్ట్ ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారియా వాస్ వెల్లడించారు. వెహికిల్ యాక్ట్ విషయంలో తామింకా ఇతర రాష్ట్రాల విధానాల్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే గుజరాత్ ఈ చట్టాన్ని నీరు గార్చింది. అంతకంటే సాధ్యమైనంత తక్కువ ఫైన్లతో జరిమానాలను అమలు చేస్తామని కూడా అన్నారు ఆ అమాత్యులు. తక్కువో, ఎక్కువో జరిమానాల సంగతి సరే, మరి ఈ వింత ఫైన్ల సంగతేంటంటే ఇదంతా చెప్పుకొచ్చాడా మంత్రి.

చూశారుగా అన్నీ ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నానంటే రూల్స్ ఒప్పుకోకపోవచ్చు. గుండీలు లేకపోతేనే ఫైన్లు వేస్తున్నారు రేపు చొక్కాను ఐరన్ చేయిచుకోలేదనో, కలర్ బాగోలేదనో, కాలర్ పట్టుకుని మరీ ఇలాంటి ఫైన్లు వేయించొచ్చు. గుంజీలు తీయించొచ్చు. తస్మాత్ జాగ్రత్త!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories