Rajasthan: ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల కుమార్తెను ప్రియుడి మాట విని చంపేసింది.

Arun Chilukuri
Published on: 19 Sept 2025 12:03 PM IST
Rajasthan: ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి
X

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల కుమార్తెను ప్రియుడి మాట విని చంపేసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

అజ్మీర్‌లోని అన్నసాగర్ సరస్సులో బుధవారం ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడింది స్వయానా ఆ పాప తల్లి అంజలీ సింగ్‌ అని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అంజలీ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

అంజలి తన భర్తను వదిలేసి, అఖిలేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే వారిద్దరి మధ్య సాఫీగా సాగే జీవితానికి ఆ మూడేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని అఖిలేష్ చెప్పాడు. ప్రియుడి మాటలు నమ్మిన అంజలి ఈ దారుణానికి ఒడిగట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంజలి రాత్రి వేళ తన కుమార్తెను సరస్సు దగ్గరకు తీసుకెళ్లింది. పాపతో సరదాగా మాట్లాడుతూ, ఆమె నిద్రపోయిన తర్వాత, ఆమెను సరస్సులోకి తోసేసి చంపింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story