తల్లి కాదు రాక్షసి.. భర్తపై కోపంతో చిన్నారులకు చిత్రహింసలు

MK Stalin: తమిళనాడులోని సత్యమంగళం మెట్టూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 4:47 PM IST
Mother Booked Thrashing 2 Year Old Son
X

తల్లి కాదు రాక్షసి.. భర్తపై కోపంతో చిన్నారులకు చిత్రహింసలు

MK Stalin: తమిళనాడులోని సత్యమంగళం మెట్టూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల బిడ్డపై కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. భర్తపై కోపంతో పసిబిడ్డను కన్నతల్లి చిత్రహింసలకు గురిచేసింది. తమిళనాడులోని విల్లిపురం జిల్లాలోని సత్య మంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్ చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యం లో ప్రదీప్‌ ను తరచు కొట్టేది తులసి. అంతేకాదు బిడ్డను కొడుతున్న దృశ్యాలు సెల్‌ ఫోన్‌ లో చిత్రీకరించి భర్తకు పంపింది తులసి. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్ తులసి కోసం ప్రత్యేక టీమ్‌లను చిత్తూరుకు పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story