జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

Srinagar: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.

Arun Chilukuri
Published on: 3 Jan 2022 8:36 PM IST
Most Wanted LeT Militant killed in Srinagar Encounter
X

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

Srinagar: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబాకు చెందిన టాప్ కమాండర్ సలీం పర్రే హతమయ్యాడు. శ్రీనగర్ లోని షాలిమర్ గార్డెన్ లో ఎన్ కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. మరోవైపు జమ్మూ సెక్టార్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, హెరాయిన్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని రోజుల కిందట ఆర్నియా సెక్టార్‌లో ఒక చొరబాటుదారుడ్ని మట్టుబెట్టినట్లు సాంబాలోని బీఎస్‌ఎప్‌ ఐజీ తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి జరిగే ఇలాంటి ప్రయత్నాలను తమ దళాలు ఎప్పటికప్పుడు విఫలం చేస్తాయని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story