Monkeypox: మంకీ‎పాక్స్‎‎పై అప్రమత్తమైన కేంద్రం

Monkeypox Case Reported in Delhi
x

Monkeypox: మంకీ‎పాక్స్‎‎పై అప్రమత్తమైన కేంద్రం

Highlights

Monkeypox: దేశంలో ఇప్పటికే నాలుగుకు చేరిన కేసులు

Monkeypox: మహమ్మారీ మంకీపాక్స్ వ్యాప్తి కట్టడికి కేంద్రం అప్రమత్తమైంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని వైద్యారోగ్యశాఖ ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అత్యవసరం సమావేశం నిర్వహిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో ఓ కేసు నమోదైన నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం.. కేరళ సహా ఇతర రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పూణే నుంచి టెస్టింగ్ కిట్లు సరఫరా చేయనుంది. ఇక ఇప్పటికే కేరళలో 4 కేసులు. ఢిల్లీలో ఒక కేసు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. మంకీపాక్స్ కట్టడిలోభాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories