Delhi Metro: మెట్రో రైలులో కోతి...ఏం చేసిందంటే
Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు లో ప్రయాణీకులతో పాటు కోతి కూడా మెట్రోల రైలులో ప్రయాణం చేసింది.
Monkey Takes Fun Ride in Delhi Metro
Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు లో కోతి సందడి చేసింది. ప్రయాణీకులతో పాటు కోతి కూడా మెట్రోల రైలులో ప్రయాణం చేసింది. ఏంటి ఆశ్చర్య పోతున్నారా...అదేం పెంపుడు కోతి కాదు. మనుషుల్లానే అది కూడా మెట్రో రైలు ప్రయాణించాలని అనుకున్నట్లువుంది. అంతే రైలు ఎక్కిన కోతి తన చేష్టలతో ప్రయాణీకులకు కొంత సేపు వినోదాన్ని పంచింది. తర్వాత సీటు పై ఓ ప్రయాణీకుడి పక్కనే కూర్చుని రైలు అద్దాల్లోంచి రాజధాని అందాలను చూసేసింది.
కోతి మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది అది కాస్త వైరల్ అయిపోయింది. ఈ వీడియోను చూసిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు కోతి ప్రయాణించిన బోగీ వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించారు.
Next Story




