Gangavilas: నేడు వారణాసిలో గంగావిలాస్‌ నౌకను ప్రారంభించనున్న మోదీ

Gangavilas: ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన నది నౌకా ప్రయాణం

Dhatripriya
Published on: 13 Jan 2023 9:01 AM IST
Modi Will Launch Gangavilas In Varanasi Today
X

Ganga River: నేడు వారణాసిలో గంగావిలాస్‌ నౌకను ప్రారంభించనున్న మోదీ

Gangavilas: ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. గంగా విలాస్ నౌకను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్‌లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్‌లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు.

Dhatripriya

Dhatripriya

Next Story