PM Modi: "బ్రిక్స్" సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు మోడీ

PM Modi: భారత్‌తోపాటు సదస్సులో పాల్గొననున్న చైనా

Shekhar G
Published on: 22 Aug 2023 10:34 AM IST
Modi To South Africa Today For BRICS Conference
X

PM Modi: "బ్రిక్స్" సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు మోడీ

PM Modi: బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు దక్షిణాఫ్రికా రాజధాని జొహాన్నెస్‌బర్గ్‌కు బయలుదేరి వెళుతున్నారు. నేడు మొదలయ్యే 15వ బ్రిక్స్‌ సదస్సు మూడు రోజులు కొనసాగుతుంది. ప్రధాని మోడీ పర్యటన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా వెల్లడించారు. ఈ సదస్సులో భారత్‌తోపాటు చైనా కూడా పాల్గొననుండటం చర్చనీయాంశంగా మారింది. మోడీ, చైనా అధినేత జిన్‌పింగ్‌ మధ్య చర్చకు అవకాశం ఉంటుందా .. అన్న ప్రశ్నకు .. చర్చలు, ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ప్రధాని సదస్సు షెడ్యూల్‌ తయారవుతోందని చెప్పారు. బ్రిక్స్‌ సదస్సు అనంతరం ‘బ్రిక్స్‌-ఆఫ్రికా అవుట్‌రిచ్‌, బ్రిక్స్‌ ప్లస్‌ డైలాగ్‌’ అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని ఆయన తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story