Modi-Putin Meet at Hyderabad House: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ

Putin India Visit: భారతదేశ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 12:38 PM IST
Modi-Putin Meet at Hyderabad House: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
X

Modi-Putin Meet at Hyderabad House: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ

Putin India Visit: భారతదేశ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇరుదేశాల మధ్య జరుగుతున్న 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు అగ్రనేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ రంగం సహా పలు కీలక అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అనంతరం, ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు పుతిన్‌ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

అంతకుముందు, వ్లాదిమిర్‌ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌ను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఇరుదేశాల అధికారుల బృందాలను పరస్పరం పరిచయం చేసుకున్నారు.

రాష్ట్రపతి భవన్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత పుతిన్‌ నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని కూడా రాశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story