Narendra Modi: జెషోరేశ్వరి కాళీ మాత ఆలయంలో మోదీ పూజలు

నరేంద్ర మోడీ:(ఫైల్ ఇమేజ్)
Narendra Modi:ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఈ రోజు ఉదయం మోదీ సందర్శించారు.
Narendra Modi: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ షట్‌ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్‌లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఈ రోజు ఉదయం మోదీ సందర్శించారు. అనంతరం కాళీమాతను దర్శించుకున్న ఆయన నేలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక బంగారు ముకుటాన్ని(కిరీటాన్ని) అమ్మవారికి అలంకరించారు.''నేడు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునే అదృష్టం లభించింది. కొవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని నేను కాళీమాతను ప్రార్థించాను'' అని మోదీ తెలిపారు.
శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగబంధు ముజిబుర్ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తెలయిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలకు అందజేశారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. భారత్, పొరుగు దేశాల్లోని 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT