Modi: అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించనున్న మోడీ.. రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Modi ఈనెల 21 నుంచి 24 వరకు మోడీ అమెరికా పర్యటన

Dhatripriya
Published on: 12 Jun 2023 4:12 PM IST
Modi Is Going To Address The US Congress
X

Modi: అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించనున్న మోడీ.. రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Modi: ప్రధాని మోడీ త్వరలో అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించనున్నారు. ఇలా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్‌ హయాంలోనూ అమెరికాలో పర్యటించిన మోడీ తొలిసారి అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించనున్న మోడీ.. అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగిస్తారు. ముఖ్యంగా అమెరికా-భారత్‌ మధ్య కొనసాగుతున్న సత్సంబంధాల ప్రాముఖ్యతను వివరించనున్నారు. ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 7వేల మంది ఇండియన్‌ అమెరికన్లు వైట్‌హౌస్‌ సమీపంలో సమూహంగా ఏర్పడి ప్రధానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే బహిరంగ సభలోనూ మోడీ పాల్గొంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story