రాజ్యసభలో మోదీ భావోద్వేగం

ప్రధాని మోడీ రాజ్యసభలో ఉద్వేగానికి లోనయ్యారు.

Samba Siva Rao
Published on: 9 Feb 2021 2:56 PM IST
Modi gets Emotional In Rajya Sabha
X

మోడీ కన్నీటీ పర్యంతం 

ప్రధాని మోడీ రాజ్యసభలో ఉద్వేగానికి లోనయ్యారు. అదీ ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ కోసం. రాజ్యసభలో విపక్షనేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15 తో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో అయన గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఆజాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కంట తడితో ప్రధాని మోడీ ''ఉన్నత పదవులు వస్తుంటాయి. అధికారమూ వస్తుంది. ఇన్ని వచ్చినా, ఎలా వుండాలో ఆజాద్ దగ్గర నేర్చుకోవాలి. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.'' అంటూ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ టూరిస్టులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సమయంలో గులాం నబీ ఆజాద్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా లో గులాంనబీ ఆజాద్ కు సెల్యూట్ చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story