Modi: జేడీఎస్‌, కాంగ్రెస్‌ కర్నాటక అభివృద్ధికి అడ్డంకిగా మారారు

Modi: ఏది ఏమైనా కర్నాటకలో ఈసారి కూడా బీజేపీదే గెలుపు

Jyothi
Published on: 30 April 2023 3:28 PM IST
Modi Comments On JDS And Congress
X

Modi: జేడీఎస్‌, కాంగ్రెస్‌ కర్నాటక అభివృద్ధికి అడ్డంకిగా మారారు

Modi: కర్నాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కోలార్‌లో జరిగిన బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక నేతలు మోడీని పూలమాలతో సత్కరించి భారీ బుద్దుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. గొర్రెల కాపరులు గొంగడితో మోడీని సన్మానంచారు. కోలార్‌, చిక్‌భళ్లాపూర్‌ జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ప్రధాని మోడీ కన్నడలో కోలార్‌ ప్రజలకు నమస్కారాలు చెప్పడంతో కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అయ్యింది.

కోలార్‌ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు... సభకు వచ్చిన వారిని చూస్తుంటే కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. కర్నాటక అభివృద్ధిలో ఈరెండు పార్టీలు అతిపెద్ద అవరోధకులన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా కర్నాటక ప్రజలు వాళ్లను క్లీన్‌ బౌల్డ్‌ చేయాలనుకుంటున్నారు.. ఏది ఏమైనా ఈసారి కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story