Pakistan: పాకిస్తాన్‌లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి

Pakistan: కర్రలు, రాడ్లతో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 9:12 PM IST
Mob Attack on a  Hindu Temple in Pakistan
X

పాకిస్థాన్ లోని హిందూ దేవస్థానంపై దుండగుల దాడి (ఫైల్ ఇమేజ్)

Pakistan: పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రహీంయార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో సిద్ధి వినాయక ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్ల సాయంతో వినాయక ఆలయంలోకి చొరబడిన ఓ మూక, విగ్రహాలను నాశనం చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతరం, సమీపంలోని రోడ్డును దిగ్బంధించి వీరంగం వేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ హిందూ నేత, పార్లమెంటు సభ్యుడు రమేశ్ కుమార్ వంక్వానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు.. దాడి ఘటనపై లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ఎంతో నిదానంగా వచ్చారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story