కరోనా వచ్చినా.. ఇలా ఓటేసిన ఎమ్మెల్యే

కరోనా వచ్చినా.. ఇలా ఓటేసిన ఎమ్మెల్యే
x
Highlights

దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు 8 రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు...

దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు 8 రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2 రాష్ట్రాల్లో 5 స్థానాలు ప్రతిపక్షం లేకుండా ఎన్నికయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది.

అయితే అక్కడ రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండడంతో శుక్రవారం ఆయన పీపీఈ కిట్‌ ధరించి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి భోపాల్‌లోని శాసనసభకు వచ్చారు. క్వారంటైన్‌లో ఉన్న ఆయన పూర్తి ప్రొటక్షన్‌తో రావ‌డంతో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదే కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ సభకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి ఆయా పార్టీలు విప్‌లు కూడా జారీ చేస్తుంటాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories