మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. ప్లకార్డుతో నిలుచున్న ఏపీ విద్యార్థి..

MK Stalin: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రాధాన్యమిచ్చే తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.

Arun Chilukuri
Published on: 3 Feb 2022 6:50 PM IST
MK Stalin Stopped his car While he was Enroute to Assembly to Meet With a boy
X

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. ప్లకార్డుతో నిలుచున్న ఏపీ విద్యార్థి..

MK Stalin: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రాధాన్యమిచ్చే తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు పక్కన "సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ" అనే ప్లకార్డుతో నిల్చున్న ఓ యువకుడ్ని చూసి తన కాన్వాయ్ ఆపేశారు. స్టాలిన్ అసెంబ్లీకి వెళ్లే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్ధి "సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ" అనే బ్యానర్‌తో నిలబడ్డాడు.

ఇది గమనించిన స్టాలిన్ వెంటనే కాన్వాయ్‌ను ఆపి, విద్యార్థితో మాట్లాడారు. తనను సతీష్‌గా పరిచయం చేసుకున్న విద్యార్థి నీట్ పరీక్షను వ్యతిరేకించినందుకు తమిళనాడు సీఎంకు ధన్యవాదాలు తెలిపాడు. దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులకు మినహాయింపులు కల్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని అర్థించాడు. యువకుడి విన్నపాన్ని విన్న స్టాలిన్ అతన్ని సముదాయించి పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story