తమిళనాడులో పాగ వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు!

ఉత్తరాదిలో కషాయజెండా ఎగురవేసిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిపై కన్నేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను బీజేపీలోకి చేర్చుకుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ పాగ వేసేందుకు ప్రయత్నిస్తోంది.

admin
Published on: 16 Nov 2020 9:11 PM IST
తమిళనాడులో పాగ వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు!
X

ఉత్తరాదిలో కషాయజెండా ఎగురవేసిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిపై కన్నేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను బీజేపీలోకి చేర్చుకుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ పాగ వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సినీ నటి ఖుష్బును పార్టీలోకి చేర్చుకుంది ఆ పార్టీ. తమిళనాట మరింత బలం పెంచుకునేందుకు అళగిరికి పార్టీ కండువా కప్పేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది. అళగిరి కూడా బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో అళగిరి భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈనెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా అళగిరి అడుగులు పడనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు అళగిరి మద్దతుదారులు సైతం బీజేపీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

admin

admin

Next Story