Maharashtra: 15 ఏళ్ల మైనర్ బాలికపై 33మంది అత్యాచారం

* 8 నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం * బాలిక ఫిర్యాదుతో 26మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 6:44 PM IST
Minor Girl Molestated by 33 Members from 8 Months in Maharashtra
X

మైనర్ బాలికపై అత్యాచారం

Maharashtra: మహారాష్ట్రలో యావత్ దేశం తలదించుకొనే ఘటన జరిగింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై 8 నెలలుగా 33మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానేకు చెందిన బాలికను లోబరుచుకున్న ఓ కిరాతకుడు.. అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు.

దొంబావలి, బద్లాపూర్, రబలే, ముర్బాద్ తదితర ప్రాంతాల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు. మొత్తం 33 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకూ 26 మంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కావడం కలకలం రేపుతోంది. ఇక ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story