ప్రేమ కోసం హోర్డింగ్‌ ఎక్కిన బాలిక !

ప్రేమ కోసం హోర్డింగ్‌ ఎక్కిన బాలిక !
x
Highlights

తనకి ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేయకపోతే తాను ఇక్కడి నుంచి దూకి చనిపోతానని హోర్డింగ్‌ పైకి ఎక్కి ఓ మైనర్ బాలిక పెద్ద హడావుడి చేసింది..

తనకి ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేయకపోతే తాను ఇక్కడి నుంచి దూకి చనిపోతానని హోర్డింగ్‌ పైకి ఎక్కి ఓ మైనర్ బాలిక పెద్ద హడావుడి చేసింది.. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లోని పర్‌దేశీ పురాకు చెందిన ఓ మైనర్‌ ఓ యువకుడిని ప్రేమించింది.. అయితే ఇదే విషయాన్ని ఇంట్లో చెబితే అందుకు ఆ బాలిక తల్లి ఒప్పుకోలేదు.. దీనితో మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంటికి దగ్గరలో ఉన్న హోర్డింగ్‌పైకి ఎక్కింది

అక్కడికి ఎక్కి తనకి నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే ఇక్కడి నుంచి దూకి చనిపోతాను అంటూ బెదిరింపులకు దిగింది. ఈ విషయం తెలుసుకున్నా పొలిసులు, తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.. వీరందరూ ఎంత చెప్పిన ఆ బాలిక కిందికి దిగలేదు..పైగా సెల్ ఫోన్ తో ఆడుకుంటూ అక్కడే కూర్చుంది.. చివరికి సదరు బాలిక ప్రేమించిన అబ్బాయిని తీసుకువచ్చారు పోలీసులు.. దీనితో ఆమె ప్రియుడు అక్కడికి వచ్చి బుజ్జగించడంతో ఆమె కిందికి దిగింది. దీనితో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories